సూపర్ స్టార్ మహేష్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సక్సెస్ లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరుతో మరో బ్లాక్ బస్టర్ అందుకు మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం తన 27వ చిత్రాన్ని గీతగోవిందం దర్శకుడు పరశురాంతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ లాక్ అయింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ సహా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ రివీల్ చేయాలేదు. ఈనెల 17 తో లాక్ డౌన్ ముగుస్తోంది. తెలంగాణలో 29 వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది.
అలాగే మే 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం. సపర్ స్టార్ 77వ పుట్టిన రోజు వేడుకలకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున మహష్ తన కొత్త విషయాలను అభిమానులకు వెల్లడించనున్నారని సోర్సెస్ చెబుతున్నాయి. పరశురాంతో ప్రాజెక్ట్ ను ఇప్పటివరకూ అధికారికం గా ఎక్కడా ప్రకటించని నేపథ్యంలో మే 31న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తో చేసే ప్రాజెక్ట్ ను మహేష్ అదే రోజు ప్రకటించనున్నారని ప్రచారం సాగుతోంది. కాబట్టి 31 ఘట్టమనేని అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ గా అస్వాదించాల్సిందే.
ఇప్పటికే ఈ స్ర్కిప్ట్ డిఫరెంట్ జానర్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మహేష్ ఇంత వరకూ ఇలాంటి జానర్ సినిమా టచ్ చేయలేదని..అతని కెరీర్ చెప్పుకునే చిత్రం నిలిచిపోతుందని కథనాలు వేడెక్కిస్తున్నాయి. మరి స్ర్కిప్ట్ లో ఎంత మ్యాటర్ ఉంటుందన్నది రిలీజ్ తర్వాత తేలుద్ది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహేష్ కుటుంబంతో హైదరాబాద్లోనే గడుపుతున్నాడు. సితార..గౌతమ్ లతో గేమ్ లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవల బయటకొచ్చిన ఆ వీడియోలు అభిమాలన్ని అలరించాయి.
