Niharika: తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ ఇవ్వగా ఈ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిహారిక మాత్రమే అని చెప్పాలి. ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదట యాంకర్ గా కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం పాటు నిలదొక్కుకోలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె చైతన్య పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అంతా బాగానే ఉంది అనుకుంటున్నా నేపథ్యంలో అతనితో విడాకులు తీసుకుని వైవాహిక జీవితానికి బై బై చెప్పేసింది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నిర్మాతగా మారి పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది నిహారిక. ఆ సంగతి అటు ఉంచితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారికా రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటు ఉంటుంది. కాగా త్వరలోనే నిహారిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యంగ్ హీరో గురించి పోస్ట్ చేసింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అంకిత్ కొయ్య.
ఆయ్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ చిన్నోడు. ఆ తర్వాత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే తాజాగా అంకిత్ కొయ్య బర్త్ డే సందర్భంగా నిహారిక ఓకే స్పెషల్ పోస్ట్ ను షేర్ చేసింది. నాకు ఐదేళ్లుగా ఈ అబ్బాయి తెలుసు..మేము కలిసినప్పుడల్లా సినిమాల గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటాం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్ గా నిలిచాడు.. నువ్వు ఇలానే స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగాలి.. హ్యాపీ బర్త్ డే అంకిత్.. అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు విషెస్ చెబుతుండగా మరికొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. స్పెషల్ గా బర్తడే విషెస్ చెబుతోంది అంటే కొంపదీసి ఆ హీరోతో ప్రేమలో పడిందా ఏంటి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.