Upasana: క్లిన్ కారా పుట్టినరోజు… ఎట్టకేలకు కూతుర్ని చూపించిన ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో?

Upasana: మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారా గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల తనయ అనే సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న పది సంవత్సరాల తర్వాత తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమాన హీరో వారసురాలు ఎలా ఉందో చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృత కనబరిచారు కానీ పాప జన్మించి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కూడా తన ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఈ చిన్నారి ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుత మాత్రం అభిమానులలో అలాగే ఉండిపోయింది.

ఇక క్లీన్ కారా నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో తన కూతురితో కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో తన కుమార్తె ఫేస్ కొంతవరకు కనిపిస్తోంది దీంతో అభిమానులు క్లీన్ కారా చూడటానికి చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఉపవాసన తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా జూలో వైట్ టైగర్ తో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసిన ఉపాసన.. హైదరాబాద్ జూలో ఉండే ఒక పులి పిల్లను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆ పులి పిల్లకు తన కూతురి పేరు క్లిన్ కారా అని పెట్టినట్లు తెలియజేశారు. ఇక ఉపాసనకు జంతువులంటే ఎంతో ప్రేమ అనే విషయం తెలిసిందే. తన ఇంట్లో కూడా ఎన్నో రకాల జంతువులను ఈమె పెంచుకుంటూ ఉన్నారు. అలాగే జూలో కూడా ప్రతి ఏడాది కొన్ని జంతువులను దత్తత తీసుకుంటూ వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇలా వన్య ప్రాణుల సంరక్షణకు తాము ఎల్లప్పుడూ మద్దతు తెలియజేస్తాము అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు బుల్లి ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.