మెగాస్టార్ ఈజ్ బ్యాక్..? “గాడ్ ఫాదర్” కి సూపర్ రివ్యూలు..!

మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మెగా డే అయితే ఈరోజు రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్” ఈరోజు థియేటర్స్ లో దసరా కానుకగా రిలీజ్ కాగా అందరిలో కూడా సినిమా ఎలా ఉంటుంది అనే ఉత్సుకత నెలకొంది.

ముఖ్యంగా ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ అనంతరం చిరు కం బ్యాక్ అందుకుంటారా లేదా అనే ప్రశ్నపై వచ్చిన ఈ చిత్రానికి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూ లు అయితే వినిపిస్తున్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది అని మళ్ళీ మెగాస్టార్ అయితే లైన్ లోకి వచ్చేశారని అంటున్నారు.

అంతే కాకుండా దర్శకుడు మోహన్ రాజాపై కూడా మంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ లాంటి ఓ కథని మార్పులు చేసి చాలా బాగా హ్యాండిల్ చేసాడని అంటున్నారు. ఇంకా చిరు మరియు సల్మాన్ లు అయితే  అదరగొట్టేశారట.

ఇంకా థమన్ ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇలా మొత్తంగా అయితే ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ రివ్యూ లు బాగా వినిపిస్తున్నాయి. మరి వసూళ్లు అయితే సినిమాకి ఎలా ఉంటాయో చూడాలి.