సుమలత కన్నీటి సందేశం

సుమలత మనసు ఆర్ద్రమైంది .  ఆమె భర్త చనిపోయిన తరువాత సుమలతలో దుఃఖం పొంగుకొచ్చింది .  మనసులో వున్న ఆవేదన , ఆక్రందనలను ట్విట్టర్ లో పంచుకుంది . సుమలత అంబరీష్ వివాహం చేసుకొని సరిగా 27 సంవత్సరాలు . ఇన్నాళ్లు తనని ఎంత బాగా చేసుకున్నాడో ఆమె కన్నీళ్లతో తెలిపింది .

“ఈ 27 సంవత్సరాలు , మీ నీడలో  హాయిగా , సంతోషంగా , సంతృప్తిగా , హుందాగా గడిపాను . కానీ ఇవ్వాళ మాత్రం మీరు లేని  లోటు  కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది . ఎదో వెలితి , ఎదో లోపం , మనసు పొరల్లో  కప్పుకున్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చి  బావురుమంటున్నాను .

నన్ను ఎలా చేసుకున్నావు . చలికాలంలో నీ సాహచర్యం వెచ్చటి రగ్గులా , వేసవి కాలం, వర్షాకాలంలో  గొడుగులా నాకు రక్షణ ఇచ్చావు . నీ ప్రేమ , నీ ఆరాధనా ఎలా మరువను?” ఆమె మనసులో వున్న భావాలను పంచుకుంది . అంబరీష్  గత నెల  24న చనిపోయాడు . ఈరోజు సుమలత , అమరిష్ వివాహ దినోత్సవం . వీరి వివాహం 8 డిసెంబర్ 1991లో జరిగింది .