సూపర్ స్టార్ మహేష్ కు బావగా ఇండస్ట్రీలోకి ప్రవేశించి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తున్న హీరో సుధీర్ బాబు. రీసెంట్ గా ఆయన చేసిన శమంతకమణి, సమ్మోహనం చిత్రాలు యూత్ లోకి బాగానే వెళ్లాయి. తన స్వంత బ్యానర్ లో చేసిన నన్ను దోచుకుందువటే చిత్రం మాత్రం సోసోగా అనిపించి సోదిలోకి రాలేదు. అయితే ఆయనకంటూ గుర్తింపు వచ్చిందనేది మాత్రం నిజం.
ఈ నేఫద్యంలో ఆయన శమంతకమణి తరహాలో మరో మల్టిస్టారర్ లాంటి చిత్రం వీరభోగ వసంత రాయులు చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ ని ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ హల్ చల్ చేసే సుధీర్ బాబు షేర్ చేయలేదు. అంతేకాదు ట్రైలర్ లో వాయిస్ ఆయనది కాదు అని తెలిసింది. దాంతో అసలు ఏం జరిగింది అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దానికి సుధీర్ బాబు
సమాధానమిచ్చారు.
‘కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్‌లో వివరించడం సాధ్యం కాదు.’ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు.
<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>For various reasons, which can't be explained in a tweet, wasn't been able to dub for my character in <a href=”https://twitter.com/hashtag/VeeraBhogaVasanthaRayalu?src=hash&ref_src=twsrc%5Etfw”>#VeeraBhogaVasanthaRayalu</a>. Yeah, THAT IS NOT MY VOICE</p>— Sudheer Babu (@isudheerbabu) <a href=”https://twitter.com/isudheerbabu/status/1052097728660926464?ref_src=twsrc%5Etfw”>October 16, 2018</a></blockquote>
<script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
ఇలా డబ్బింగ్ చెప్పకపోవటానికి, ట్రైలర్ లాంచ్ కు హాజరు కాకపోవటానికి, ట్రైలర్ ని షేర్ చేయకపోవటానికి ..చిత్రయూనిట్‌తో వివాదాల కారణంగా చెప్పుకుంటున్నారు.
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వీర భోగ వసంత రాయలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు
జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న (సోమవారం) రిలీజ్ అయ్యింది.
<iframe width=”697″ height=”392″ src=”https://www.youtube.com/embed/KT6875hyV1U” frameborder=”0″ allow=”autoplay; encrypted-media” allowfullscreen></iframe>