వైర‌స్ అంటే భ‌యం భ‌క్తి లేదా కిచ్చా?

                             భ‌యం లేకుండా షూటింగ్ ప్రారంభించాడు

అవును కిచ్చాకి భ‌యం భ‌క్తి లేదు. వైర‌స్ అంటే అస‌లే లెక్క లేదు. ఓవైపు టాలీవుడ్ హీరోలంతా భ‌య‌ప‌డి ఇండ్ల‌లో దాక్కుంటే అత‌డు మాత్రం దేనికీ భ‌యప‌డ‌క హైద‌రాబాద్ అన్న పూర్ణ స్టూడియో లో కామ్ గా షూటింగ్ ప్రారంభించాడు.

కోవిడ్ -19 మహమ్మారి కిచ్చా సుదీప్ ని ఏమాత్రం భ‌య‌పెట్ట‌లేదన్న‌ది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ త‌ర్వాత అత‌డు న‌టిస్తున్న‌ తొలి కన్నడ చిత్రం `ఫాంటమ్` ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. కొరోనావైరస్ నేప‌థ్యంలో కొత్త మార్గదర్శకాలు అనుస‌రిస్తూ జాగ్రత్తలతో షూటింగ్ చేయ‌నున్నార‌ట‌.

నియ‌మాలు పాటిస్తూ షూటింగులు ప్రారంభించవచ్చని కర్ణాటక – తెలంగాణ-ఏపీ ప్రభుత్వాలు ఇటీవల ప్రకటించాయి. ఆ క్ర‌మంల‌నే ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి సుదీప్ అత‌డి బృందం షూటింగులో పాల్గొంటార‌ట‌. అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం  వ‌హిస్తున్నారు. ఇక ఫాంటమ్ సెట్స్ లో అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ – నర్సులను అందుబాటులోకి తేనున్నార‌ని తెలిసింది.

ప్ర‌భుత్వ స్కూళ్లను ద‌త్త‌త తీసుకున్న కిచ్చా

భ‌యం లేకుండా షూటింగ్ ప్రారంభించ‌డ‌మే కాదు.. కిచ్చా సుదీప్ మ‌రో ఆద‌ర్శ‌వంత‌మైన ప‌నిని చేశాడు. అదేమంటే.. కర్నాట‌క చిత్ర‌గుడ జిల్లా‌లోని నాలుగు ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను ద‌త్త‌త తీసుకుని విద్యార్థుల్ని చ‌దివిస్తున్నాడు. ఆ స్కూల్ టీచ‌ర్ల జీతాల్ని కూడా కిచ్చా చెల్లిస్తున్నార‌ట‌. స్కూల్ అవ‌స‌రాల్ని తీరుస్తున్నాడ‌ట‌. హ్యాట్సాఫ్ టు కిచ్చా..