హైపర్ ఆదితో కామెడీ, చైతూకు కలిసొస్తుందా?

తమ సినిమా కేవలం సీరియస్ గా నడిచేది మాత్రమే కాదని …కామెడీకు కూడా సరైన ప్రయారిటీ ఉందని చెప్పటానికి అన్నట్లుగా ‘సవ్యసాచి’టీమ్ తాజాగా ఓ టీజర్ ని వదిలింది. సినిమాలో భాగంగా ‘సుభద్ర పరిణయం’కు సంబంధించిన ఓ కామెడీ సన్నివేశం వస్తుంది. దీన్నే టీజర్ గా కట్ చేసి వదిలారు. టీజర్లో అర్జునుడి గెటప్‌లో నాగచైతన్య, కృష్ణుడి గెటప్‌లో వెన్నెల కిశోర్‌ నటించారు. కృష్ణుడిని ధర్మరాజు గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ..‘కృష్ణా బలరాముడు అంటే రాముడికి చుట్టమా?’ అని అడగటంతో టీజర్ మొదలైంది.

ఇందుకు వెన్నెల కిశోర్‌ వెటకారంగా సమాధానమిస్తూ..‘సుదర్శన చక్రం సర్వీసింగ్‌కు ఇచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే నీకుండేదిరా దరిద్రుడా’ అని తిడతాడు. అలా ఫన్నీ గా ఈ టీజర్ నవ్వులతో నడిచింది. జబర్దస్త్ లో పాపులరైన హైపర్ ఆది ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశం.

 
నాగచైతన్య హీరో గా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో
మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నవీన్‌, రవి, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. నవంబర్‌ 2న అంటే రేపు ‘సవ్యసాచి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.