“బాహుబలి” సీరిస్: యంగ్ రమ్యకృష్ణ గా ఆమెనే ఫైనల్


సినిమాల కంటే వెబ్ సిరీస్ లకి రోజు రోజుకీ డిమాండ్ బాగా పెరిగుతోంది. ఇది గమనించిన బాలీవుడ్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్ లలో నటిస్తూ, వాటికీ మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ ల డిమాండ్ ఇప్పుడు టాలీవుడ్ కి కూడా తాకింది. అందులో భాగంగా .

ఇప్పటికే “గ్యాంగ్ స్టార్స్”పేరిట జగపతిబాబు, శివాజీలతో నందినిరెడ్డి ఒక వెబ్ సిరీస్ తీసిన సంగతి తెలిసిందే. అయితే అది డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న “బాహుబలి” ప్రీక్వెల్ ని వెబ్ సిరీస్ గా ప్లాన్ చేసారు.

ఈ సిరీస్ ని ప్రముఖ దర్శకులు దేవాకట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు దఫాలుగా ఉండే ఈ వెబ్ సిరీస్ కు “బాహుబలి యూనివర్సల్” అనే పేరును పెట్టారు. ఇందుకోసం ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఆర్కా మీడియా సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సిరీస్‌లో నటించే వారిని తాజాగా అనౌన్స్‌ చేసింది. శివగామిగా మృణాల్‌ ఠాకూర్, స్కందదాస్‌గా రాహుల్‌ బోస్, అతుల్‌ కులకర్ణి, అనూప్‌ సోనీ వంటి నటులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఈ వెబ్ సిరీస్ తాలూకు షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయి గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయని సమాచారం. నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థ అండ ఉంది కాబట్టి..విదేశాల్లో గ్రాఫిక్స్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెండితెరపై విశ్వ విజేతగా నిలిచి తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగించిన “బాహుబలి” చిత్రం ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా ఇదే రేంజ్ లో సత్త చాటుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్దకం.