పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా దేశం మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న మూవీ టీం సోమవారం హైదరాబాదులోని యూసఫ్ గూడా లో పోలీస్ గ్రౌండ్స్ లో ప్రమోషనల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రముఖులందరూ సినిమాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా సినిమా గురించి, సినిమా కోసం వారు పడిన తపన, మిగిలిన నటులు సినిమా కోసం చేసిన త్యాగం అన్ని చెప్పుకొచ్చాడు. ఇంకా అల్లు అర్జున్ ఏమన్నాడంటే ఈ సినిమా కోసం పనిచేసిన వారందరూ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు.
ప్రొడ్యూసర్లు ఏమాత్రం ఆలోచించకుండా మా కోసం కోట్లు కుమ్మరించారు. అలాగే సినిమాలో ఫహద్ ఫజిల్ నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా నటించారు. సినిమా తర్వాత కేరళ వాళ్ళందరూ అతడిని చూసి గర్వపడతారు. అలాగే ఈ సినిమాలో రష్మిక కష్టం చూసి చాలా బాధేసింది, ఇలాంటి అమ్మాయితో కలిసి పనిచేయాలి అనిపించేలా పనిచేసింది అని చెప్పాడు అల్లు అర్జున్.
నాకోసం ఆడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ మూడుసార్లు మాత్రం ఈ సినిమా ఆడాలని గట్టిగా కోరుకున్నాను, సుకుమార్ గారు ఈ సినిమా కోసం పడుతున్న కష్టం చూసి కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను, అలాగే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వపడ్డారు ఆ తర్వాత పుష్ప తెలుగులో అంతే స్థాయిలో ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను.
అలాగే ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు సినిమా యూనిట్ వాళ్లు నిజానికి కష్టపడటం అనటం కన్నా వాళ్ళ జీవితాన్ని ఇచ్చేశారు అనటం కరెక్ట్, అందుకే వాళ్ల కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను అని చెప్పాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని చూడబోతున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను సినిమా తీసింది మేము అయినా తీసింది మీకోసం ఇది మా గొప్పతనం కాదు మీ ఆదరణ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.