అయోధ్య ట్రస్ట్‌కు స్టార్ హీరో 5 కోట్ల విరాళం

అయోధ్యలో వంద‌లాది ఎక‌రాల్లో శ్రీ‌రాముని ఆల‌యాన్ని అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా నిర్మించేందుకు భూమి పూజ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 5న ప్ర‌ధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘ‌నంగా ఈ ప్రారంభోత్స‌వ వేడుక జ‌రిగింది. అనంత‌రం దేశ‌వ్యాప్తంగా రామ భ‌క్తుల్లో ఆనందం వెల్లి విరిసింది. హిందూ జ‌న్మ‌భూమి పూజోత్వ‌వాల‌తో హోరెత్తింది.

రామాల‌య నిర్మాణానికి ప్ర‌తి భ‌క్తుడు ఇచ్చిన విరాళాన్ని మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తున్నామ‌ని క‌ర్త‌లు చెబుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అయోధ్య ట్రస్ట్‌కు రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారని పెద్ద ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎలా ఎక్కడ ప్రారంభమైందో ఎవరికీ తెలీదు. ముంబై మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం సాగుతోంది.

అయితే కింగ్ ఖాన్ రెడ్ చిల్లీస్ కి సంబంధించిన ఓ సీనియ‌ర్ మేనేజర్ ఈ గాసిప్‌ను ఖండించారు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిసారీ ముంబైలో త‌న ఖ‌రీదైన వైట్ హౌస్ ని ప్లాస్టిక్ దుస్తుల‌తో చుట్టేయ‌డం షారూక్ కి అల‌వాటు. ఈసారీ అదే చేశాడు. కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉండటానికి షారూక్ ఇలా చేశాడంటూ ఓ ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత అయోధ్య కోసం ఐదు కోట్లు అన్న ప్ర‌చారం మొద‌లైంది. అన్న‌ట్టు మోదీ ప్రారంభించే ఏ కార్య‌క్ర‌మానికైనా కిలాడీ అక్ష‌య్ కుమార్ స్పందిస్తుంటారు. విరివిగా విరాళాలు ఇస్తుంటారు. ఈసారి రామాల‌య నిర్మాణానికి ఆయ‌నేమీ సాయం చేయ‌లేదా? చేసినా బ‌య‌ట‌కు చెప్ప‌లేదా?