Sharukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న షారుఖ్ ఖాన్ ఇటీవల కాలంలో ఈయన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇకపోతే తాజాగా షారుక ఖాన్ ఒక టాలీవుడ్ హీరోని బండ బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. మరి ఈయన ఏ హీరోని అంతలా అవమానించారు అసలు ఎందుకు తిట్టారనే విషయానికి వస్తే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జగపతిబాబు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం జగపతిబాబు విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగపతిబాబుని ఉద్దేశించి షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యల గురించి స్వయంగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన అంతఃపురం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగులో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో హిందీలో కూడా ఈ చిత్రాన్ని కృష్ణవంశీ షారుఖ్ ఖాన్ తో రీమేక్ చేయించారు. అయితే ఒరిజినల్ లో జగపతిబాబు చాలా ఇంటెన్స్ తో నటించాడు. అయితే షారుక్ ఖాన్ నటించేటప్పుడు జగపతిబాబు చేసిన సీన్ ను చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి యాక్టింగ్ చేశారట. ఇక లాస్ట్ లో జగపతిబాబు చనిపోయే ముందు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. షారుక్ ఖాన్ ఎంత ట్రై చేసినా ఆ ఎక్స్ప్రెషన్ అంత పర్ఫెక్ట్ గా రావడం లేదు.
దాదాపు అదొక సీన్ చేయడానికి 15 టేకుల వరకు షారుక్ ఖాన్ తీసుకున్నారట. అయిన సరిగా రాకపోవడంతో ఆ బాస్టర్డ్ చాలా అద్భుతంగా చేశాడు అంటూ కృష్ణవంశీతో షారుక్ ఖాన్ చెప్పారట. ఇదే విషయం జగపతిబాబు దగ్గర కృష్ణవంశీ చెప్పడంతో ఆయన నన్ను తిట్టినట్టు కాదు నన్ను ప్రశంసిస్తున్నట్టు ఫీలయ్యానని జగపతిబాబు తెలియజేశారు. షారుక్ తన నటన గురించి అలా మాట్లాడారు అంటే నిజంగా గర్వించదగ్గ విషయమే కదా అంటూ జగపతిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
