ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే డైరెక్టర్ తరువాత రైటరే బాగుండాలి. కానీ, మన తెలుగు సినిమా ప్రపంచంలో రైటర్ పాత్రకు సంబంధించి ఎప్పుడూ తగినంత ప్రాధాన్యత లేదని ఎప్పటినుండో వినబడుతూ వస్తోన్న ప్రధాన విమర్శ. అయినా ఆ సమస్య పై ఇంకా ఫిల్మ్ సర్కిల్స్ లో విచారణ జరుగుతూనే ఉంది. రచయితకి పేరు పడుతుందో లేదో అని చివరివరకూ అనుమానమే. తీవ్ర మనోవేదనే. అందుకేనేమో రైటరే తన పాత్ర పరిధిని పెంచుకుంటూ డైరెక్టర్ గా మారిపోతున్నాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా ఏలుతున్న వారిలో.. ఎక్కువగా రైటర్ నుండి డైరెక్టర్ గా మారినవాళ్లే.
అలాంటి వాళ్లల్లో ప్రముఖుడు ముఖ్యడు కూల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. కొరటాల రైటర్ గా ఉన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురై కసితో డైరెక్టర్ అయ్యాడు. ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్లు పిలిచి మరీ సినిమా చేసి పెట్టమని ఆడిగించుకునే స్థాయికి కొరటాల వెళ్ళాడంటే.. అది కచ్చితంగా కొరటాల గొప్పతనమే. కాగా ఇప్పుడు కొరటాల శివ నిర్మాతగా తన అభిరుచికి తగ్గ కథాబలం ఉన్న సినిమాలను ఓటీటీ కోసం చేయబోతున్నాడు. పైగా పూర్తి స్క్రిప్ట్ కూడా కోరటాలే ఇస్తున్నాడు.
సినిమా నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు మోసాలతో పాటు సినిమా పై ఉన్న ప్రేమ, నిజాయితీని కూడా ఎలివేట్ చేస్తూ కొరటాల స్క్రిప్ట్ రాసారట. అలాగే రైటర్ ల కష్టాలతో పాటు హీరోయిన్స్ బాధలను కూడా ఈ సిరీస్ లో కొరటాల కవర్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుందని రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి అలాగే ఈ సమాజంలోని అన్యాయాలను అరికట్టే విధానం పై ఓ కొత్త థాట్ తో కొరటాల శివ ఈ ఆచార్య సినిమాని తీస్తున్నట్లు తెలుస్తోంది.