‘2.0’ రాజమౌళి అడ్వాన్స్ ట్వీట్..రివ్యూ కుదురుతుందో లేదో

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో సెలబ్రెటీలు తమ విషెష్ తెలుపుతున్నారు. తాజాగా రాజమౌళి సైతం ఈ టీమ్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.

రజినీకాంత్ నటించిన 2.O సినిమాను చూసేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ చాలా అవతారాలను చూసేందుకు ఇంకా ఒక రోజుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి రాజమౌళి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాపై రాజమౌళి రేపో, ఎల్లుడో రివ్యూ ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తన తాజా చిత్రం షూటింగ్ లో ఉన్న రాజమౌళికు అంత తీరక ఉంటుందో లేదో చూడాలి.

సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమనేది ఖాయమైపోయింది.

ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.ఇక ఈ చిత్రం లెంగ్త్ విషయానికి వస్తే కేవలం 2.28 గంటలు (148 నిమిషాలు) మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యనానికి గురి చేస్తోంది. దర్శకుడు శంకర్‌ సినీ కెరీర్‌లో అతి తక్కువ నిడివి ఉన్న సినిమా ఇదే కావటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లపై ‘2.ఓ’ను విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని పంపిణీదారులు భావిస్తున్నారట. దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.ఓ’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.