శ్రుతి స‌డెన్ గా ప్ర‌త్య‌క్ష‌మైంది.. వాట్టూడూ?

అందాల శ్రుతి హాస‌న్ న‌టించిన ఓ సినిమా రిలీజై చాలా కాల‌మే అయ్యింది. మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక ఈ అమ్మ‌డు వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసింది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమా రిలీజ్ కి రాలేదు. ప్ర‌స్తుతం లాభం అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ‌ ఓ ఫుడ్ కోర్ట్ నుండి బయటకు వ‌స్తూ లేటెస్టుగా కెమెరాకి చిక్కింది. పోష్ ఏరియాలో అంతే ల‌గ్జ‌రీగా క‌నిపించింది ఈ బ్యూటీ.

ఇక మాస్ మహారాజా రవితేజ స‌ర‌స‌న గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రంలో న‌టించేందుకు శ్రుతి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మ‌రోవైపు ట్రెడ్ స్టోన్ అనే అంతర్జాతీయ సిరీస్ లో అవ‌కాశం ద‌క్కించుకుంది. యాక్షన్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సిరీస్ లో నీరా పటేల్ అనే భారతీయ మూలాలున్న కిల్ల‌ర్ గా న‌టిస్తోంది. మునుముందు మ‌రిన్ని సినిమాల‌కు సంత‌కాలు చేసేందుకు క‌థ‌లు వింటోంద‌ని తెలుస్తోంది. ఉన్న‌ట్టుండి ఇలా లాభం చిత్రీక‌ర‌ణ‌లో కెమెరా కంటికి దొరికిపోవ‌డ ఆ ఫోటోలు ఫ్యాన్స్ లో వైర‌ల్ అయిపోవ‌డం హీటెక్కిస్తోంది.