‘‘టిఆర్ఎస్ లో రామన్న (కేటిఆర్) రాముడి లాంటివాడైతే.. నేను లక్ష్మణుడి లాంటివాణ్ణి. ఏ విషయంలోనైనా అన్నమాట నేను జవదాటను’’ అని చాలా సందర్భాల్లో ఆర్మూరు తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడుతుంటేవాడు. ఈ మాటలు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చంటే టిఆర్ఎస్ అధినాయకత్వంలో తనకు అంత పలుకుబడి ఉంది అన్న ఇంప్రెషన్ కలిగించడమే. అటువంటి జీవన్ రెడ్డిని క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో అడ్డంగా ఇరికించేసింది యాంకర్ శ్రీరెడ్డి. తమిళంలో ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంర్వ్యూలో పార్క్ హయత్ హోటల్ లో జీవన్ రెడ్డి చేసిన సీక్రెట్ వ్యవహారాలన్నీ గుట్టు రట్టు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో శ్రీరెడ్డి పెద్ద దుమారం రేపింది. పూర్తి వివరాలు చదవండి.
టిఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఒక వెలుగు వెలిగాడు. ప్రగతి భవన్ కోటరిలో మనిషిగా మెలిగాడు. యువ నేత కేటిఆర్ కు తానే అత్యంత సన్నిహితుడిని అని కూడా పబ్లిక్ లో ఇమేజ్ దక్కించుకున్నాడు. ఒక దశలో అయితే కేటిఆర్ బినామీ జీవన్ రెడ్డి అని కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపించారు. నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనను రెండు భాగాలుగా విభజిస్తే తొలి భాగంలో ఇవన్నీ జరిగిపోయాయి. దాదాపు మూడేళ్ల పాటు పైన చెప్పబడిన వ్యవహారమంతా నడిచింది.
కానీ ఇంటెలిజెన్స్ ఊకుంటదా? ఎవరి లెక్కలేంటి? ఎవరి కథలేంటి పూసగుచ్చినట్లు సిఎంకు చెప్పడమే దాని పని. జీవన్ రెడ్డి బండారాన్ని ఇంటెలిజన్స్ కేసిఆర్ టేబుల్ ముందు ఎప్పుడో పెట్టేసింది. పార్క్ హయత్ హోటల్ లో జీవన్ రెడ్డి చేసిన వ్యవహారాలన్నీ కేసిఆర్ కు తెలిసిపోయాయి. దీంతో జీవన్ రెడ్డికి కేసిఆర్ వార్నింగ్ ఇచ్చారని, అప్పట్లో ప్రచారం కూడా అయింది. ప్రగతి భవన్ మెట్లెక్కొద్దని కూడా సీరియస్ అల్టిమేటం ఇచ్చారని టాక్ నడిచింది. నిజానికి మొదటి భాగంలో జీవన్ రెడ్డి అయినదానికి కానిదానికి ప్రగతి భవన్ లో, సిఎం నివాసంలో కనిపించారు. కానీ ఎప్పుడైతే పార్క్ హయత్ హోటల్ వ్యవహారం కేసిఆర్ నోటీసుకు వచ్చిందో జీవన్ రెడ్డి ప్రగతి భవన్ లో కనిపించడం లేదు. దీన్ని బట్టి ప్రగతి భవన్ కు రావొద్దని సీరియస్ గానే చెప్పినట్లు తేలిపోయింది.
ఇక తాజాగా ఆర్మూరు జీవన్ రెడ్డి గుట్టు రట్టు చేశారు యాంకర్ శ్రీరెడ్డి.‘‘పార్క్ హయత్ హోటళ్లో జీవన్ రెడ్డి చాలామంది అమ్మాయిలను వాడుకున్నాడు. నా దగ్గర చాలా మంది పేర్లు ఉన్నాయన్నారు. నన్ను కూడా ఆర్మూరు జీవన్ రెడ్డి రెండు మూడుసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అయినా నేను లొంగిపోలేదు. జీవన్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు.. నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పుకునేవాడు. అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి అంతా నా చేతిలోనే ఉందనేవాడు. జీవన్ రెడ్డి వంద శాతం ఫ్రాడ్. చాలా మంది నా ఫ్రెండ్స్ ను కూడా జీవన్ రెడ్డి వాడుకున్నాడు. తన వద్ద ఉన్న బ్లాక్ మనీ తోనే చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తున్నారని అనేవాడు. బెల్లంకొండ సురేష్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు.’’ అని శ్రీరెడ్డి వెల్లడించారు.
శ్రీరెడ్డి తమిళ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. కేసిఆర్ కుటుంబానికి నమ్మినబంటు లాంటి వ్యక్తి జీవన్ రెడ్డి మీద విమర్శలు రావడంతో టిఆర్ఎస్ నాయకత్వం ఇరకాటంలోకి నెట్టబడ్డది. నిజానికి జీవన్ రెడ్డి వ్యవహారం తెలిసిన వెంటనే ప్రగతతి భవన్ కు నో ఎంట్రీ అన్నారు. కానీ కేసిఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటన రోజే ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో జీవన్ రెడ్డి పేరును కూడా ప్రకటించారు. దీన్నిబట్టి జీవన్ రెడ్డికి పార్టీ అధినాయకత్వం సపోర్ట్ ఉన్నట్లే కదా అంటున్నారు.
ఒకవైపు టిఆర్ఎస్ పార్టీలో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఆయనకు సీటు ఇస్తారా? లేదా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఆర్మూరు జీవన్ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ బాగోతం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని మార్చి సురేశ్ రెడ్డికి సీటిస్తారా? లేదంటే జీవన్ రెడ్డినే కంటిన్యూ చేస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. తీరా ఎన్నికల వేళ శ్రీరెడ్డి జీవన్ రెడ్డి మీద తమిళనాడులో బాంబు పేల్చడంతో పెద్ద దుమారం రేగుతున్నది. ఏం జరుగుతుందో చూడాలి.
శ్రీరెడ్డి తమిళంలో ఇచ్చి ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో కింద ఉంది. శ్రీరెడ్డి ఏం చెప్పిందో చూడండి.