”ఆ కథలో ఏమైంది అంటే.. తేజ, ఇల్లీ అక్కని (ఇలియానా) తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. నువ్వు కెమెరాకి సెట్ కావు ముంబైకి పో అని, కాజల్‌ని సెలెక్ట్ చేశాడు. ఇల్లీ అక్క బాధపడుతుందని వైవీఎస్ చౌదరి పోనీలే పాపం అని దేవదాస్ లో ఆఫర్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇలియానా హిందీలో సిమ్మ సెటిల్డ్. మనోడు (తేజ) బురదలో పందిలా ఊళ్లో వాళ్ల మీద బురద వేస్తూ ఉంటాడు. లిస్ట్ చిన్నది కాదు.. పార్ట్ 2 కమ్మింగ్ సూన్” అని తన పోస్ట్ లో పేర్కొంది శ్రీ రెడ్డి.
తేజ అసలు వ్యవహారం, ఇలియానా తో తాజ్ బంజారాలో ఆయన చేసిన రాసలీల తాలూకు విషయాలు చెప్పేస్తా అంటూ రెండు రోజులు క్రితం వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి.. అన్నంత పని ఇలా చేసేసింది.
ఇంతకీ శ్రీ రెడ్డి పోస్ట్ తేజను ఎందుకు రోడ్డుకు ఈడ్చే పోగ్రాం పెట్టుకుందంటే.. రీసెంట్ గా తన లేటెస్ట్ మూవీ సీత ప్రమోషన్స్ లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు చూసి శ్రీ రెడ్డి మండింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని, ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ శ్రీ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో తేజని శ్రీ రెడ్డి టార్గెట్ చేసేసింది.