శ్రీ రెడ్డి ఓ ఆటంబాంబ్‌లాంటిది. ఆ బాంబ్ ఎప్పుడు ఎవరి మీద పడుతుందో చెప్పలేం. ఆ మధ్య మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసింది. దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్‌పై ఆరోపణలు, రామ్ గోపాల్ వర్మ చెప్పుడు మాటలతో పవన్ కళ్యాణ్‌ను మీడియా ముఖంగా తీవ్రంగా దూషించడంతో శ్రీ రెడ్డి కథ కంచికి చేరింది. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా తిట్టడంతో మీడియా మొత్తం శ్రీ రెడ్డిని పట్టించుకోవడమే మానేసింది.
ఇక చేసిది ఏమీ లేక చెన్నైకి వెళ్లి సెటిలైంది. అడపాదడపా చిత్రాలను చేస్తూ, యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక, వంటలు వండే ప్రోగ్రాంలను చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటోంది. అయితే మధ్య మధ్యలో తన నోటికి పని చెబుతూ ఉంటుంది. నాగబాబు, పవన్ కళ్యాణ్, నాని, రానా, అభిరాం వంటి వారిని టార్గెట్ చేస్తూ పచ్చి బూతులు తిడుతూ ఉంటుంది. ఇక రీసెంట్‌గా రానా బావా పెళ్లి సంగతులు అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో పెట్టేసింది.
ఇక తాజాగా ఈ ఏడాదిలో కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ ఒకరిని పరిచయం చేసింది శ్రీ రెడ్డి. తనకు కాబోయే భర్త అంటూ మొదటి సారి స్క్రీన్‌కు పరిచయం చేసింది. మరో పోస్ట్ చేస్తూ తన సోదరులు, భర్తను కూడా చూపెట్టింది. అయితే ఇవన్నీ కెవలం జిమ్కిక్కులేనని, పెళ్లి కాలేదు, భర్త కూడా కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సినిమా కోసం ఆ పాత్రను పోషిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీ రెడ్డి పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.