తెలుగు నాట శ్రీరెడ్డి రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఏకంగా పెద్ద పెద్ద ఫ్యామిలీల పునాదులనే కదిపింది. దగ్గుబాటి అభిరామ్ పేరును బయటకు లాగి ఓ రచ్చ చేయగా.. పవన్ కళ్యాణ్‌ను పచ్చి బూతులు తిట్టి మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగింది. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ మొదలుపెట్టిన ఉద్యమం కాస్తా ఆ ఎపిసోడ్స్‌తో సైడ్ ట్రాక్ ఎక్కేసింది. అప్పటి వరకు శ్రీరెడ్డిపై ఉన్న మంచి అభిప్రాయం కూడా చెరిగిపోయింది.
ఆ తరువాత శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లి సెటిలైంది. అయితే మధ్యమధ్యలో తెలుగు ఇండస్ట్రీ, రానా, నాని, పవన్ కళ్యాణ్ వంటి వారిపై కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక తనను మోసం చేసిన దగ్గుబాటి అభిరామ్‌ను మాత్రం సమయం దొరికినప్పుడల్లా.. ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుంది. తాజాగా దగ్గుబాటి అభిరామ్ కారుకు ప్రమాదం జరిగిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ జరగలేదని దగ్గుబాటి ఫ్యామిలీ ఖండించింది. కానీ శ్రీరెడ్డి మాత్రం అభిరామ్, కారు ప్రమాదంపై స్పందించింది.
ఈ శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. “అభి నీకు గుర్తుందా? ‘నీ కారెంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడిని? సురేష్ బాబు కొడుకును? రామా నాయుడు మనవడిని? నీదో డొక్కు కారు? నువ్ ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి’ అని అన్నావే? నన్ను, నా కార్‌ను అవమానించావే? ఈ రోజు నీ కారుకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది.
దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు ఎప్పుడూ మిడిసిపడకు.. ఈ డబ్బులు పేరు అందం అన్నీ అశాశ్వతం.. శాశ్వతమైనవి కొన్నే మంచితనం, మంచి పేరు ఎదుటివారిని అర్థం చేసుకోవడం ఎదుటోళ్లకు అపకారం చేయకుండా మంచిగా ఉండటం. నేనైతే ఓ పెద్ద అంత పెద్ద ఉత్తమురాలిని, మహర్షిని అయితే కాకపోవచ్చు గానీ చాలా మటుకు ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను” అని ఎంతో వేదాంతం మాట్లాడింది.