వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్! అంటూ ఉర్రూతలూగించిన నవతరం గాయని గీతా మాధురిని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. తెలుగు సినీపరిశ్రమలో హుషారైన గాయనీమణిగా ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన గీత హీరో నందుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ జోడీ. గత ఏడాది బిగ్ బాస్ 2
లో గీతా మాధురి సందడిని అభిమానులు మర్చిపోలేరు. హౌస్ లో బోలెడంత సందడి చేస్తూ ఎనర్జీ పెంచింది.
అయితే ఆ షో అయిపోయాక మాత్రం గీత ఎందుకనో కనుమరుగైంది. కనీసం సోషల్ మీడియాలో అయినా టచ్ లో లేదు. దీంతో ఏమైంది? అనుకున్నవారికి అసలు సంగతి తెలిసొచ్చింది నేడు. గీతా మాధురి త్వరలో మమ్మీ కాబోతోంది. ప్రస్తుతం ఎనిమిదో నెల ఫ్రెగ్నెన్సీ. ఈ విషయాన్ని గీతనే స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా భర్త నందుతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆనందం ఆవర్ణమైన వేళ ఆలు మగలు ఇలా ఉల్లాసంలో సరసంగా కనిపించారు. మామ్ డాడ్ కాబోతున్న ఈ జంట ఉత్సాహం అభిమానుల గుండెల్ని తాకుతోంది.