గీతా మాధురి నందు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వారిపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, రూమర్లపై సెటైరికల్‌గా స్పందించడంలో నందు, గీతా మాధురి ముందుంటారు. ఈ ఇద్దరి ముచ్చటైన జంటపై ఎన్నో రకాలుగా వార్తలు వస్తుంటాయి. విడిపోయారని, దూరం పెరిగిందంటూ వచ్చే పిచ్చి కూతలపైనా సెటైర్స్ వేస్తుంటారు. పైగా అలాంటి రూమర్లను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నేడు ఈ జంటకు వివాహాం జరిగి ఏడేళ్లు నిండాయి.
ఈ క్రమంలో ఏడేళ్ల తమ వివాహా బంధాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరూబాగానే ట్రై చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదట. అర్ధరాత్రి 12 గంటలకు గీతా మాధురి ఫోన్ చేసిందట. కానీ నందు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడట. బాగా నిద్రలో ఉండటంతో లేపలేకపోయాడట. పొద్దున్నే తాను విష్ చేద్దామని ట్రై చేస్తుంటే గీతా మాధురి డీప్ స్లీప్‌లో ఉందట. ఇలా మొత్తానికి విష్ చేసుకోకుండానే ఈ ఏడేళ్ల వివాహా బంధం ప్రత్యేకంగా మిగిలిపోయింది.
అలా విష్ చేసుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో నందు తన అభిప్రాయాన్ని పెట్టేశాడు. రాత్రి జరిగింది జరిగినట్టు చెప్పేశాడు. రాత్రి అలా జరిగింది.. కాబట్టి ఇలా పోస్ట్ పెడుతున్నాను.. నువ్ ఎప్పుడు ఈ పోస్ట్ చూస్తే అప్పుడు కాల్ చేయ్.. అయితే క్రికెట్ కామెంటరీ చేస్తుంటానేమో.. కానీ స్టూడియోలో సిగ్నల్ ఉండకపోవచ్చు.. కాబట్టే ప్రస్తుతం ఇలా సరిపెట్టుకో.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ చెప్పుకొచ్చాడు.