బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ మాజీ కంటెస్టెంట్ల (హరితేజ, శ్రీముఖి, అలీ రెజా, గీతా మాధురి)రాకతో చిట్ చాట్ ప్రోగ్రాంల మారింది. సీనియర్ జూనియర్లు ముచ్చట్లు పెట్టుకుంటే ఎలాంటి హంగామా వస్తుంది.. వారి కష్టసుఖాలను పంచుకుంటే ఎలా ఉంటుందో వ్యవహారం అలా మారింది. అయితే బయట ఏం జరుగుతోంది.. ఎవరిపై ఎలా నెగెటివిటీ ఉంది.. ఇలాంటి విషయాలన్నీ సీనియర్ కంటెస్టెంట్లకు తెలుసు. అయితే లోపలకి వచ్చిన వారు.. తమ ఇష్టానికి నచ్చినట్టుగా మాట్లాడేందుకు వీలుండదు. బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాల్సి ఉంటుంది.
వారి మాటల్లోనే బయట టాక్ ఎలా నడుస్తోంది.. ఎవరి ఇమేజ్ ఎలా ఏర్పడుతుందనే విషయాలను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే కచ్చితంగా నెగెటివ్ పాయింట్స్ అయితే చెప్పరు. ఎందుకంటే ఉన్న నాలుగైదురోజులైన ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వారు కుంగిపోయేలా చేయలేరు. అందుకే అందరూ మంచిగా ఆడుతున్నారు.. అందరికీ ఫ్యాన్ ఫాలొయింగ్.. సూపర్.. డూపర్ అంటూ చెప్పుకొచ్చారు.
అఖిల్‌కు లేడీ ఫాలోయింగ్ భారీగా పెరిగిందంటూ సీనియర్ కంటెస్టెంట్లు చెప్పడం, నువ్ ఎప్పుడూ ఏదో ఒకటి మైండ్‌లో రన్ చేస్తుంటావు.. ఎవరి గురించో ఆలోచిస్తావ్ అని అఖిల్‌కు చెప్పడంతోనే కాన్ఫిడెన్స్ వీర లెవెల్‌లో పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే హారిక అఖిల్ గురించి కూడా ఎక్కువ మాట్లాడే సరికి ఆ ఇద్దరూ మరింత సన్నిహితంగా అయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తానికి హారిక అఖిల్ మాత్రం టైటిల్ రేసులో ఎక్కడా కనిపించడం లేదు. కానీ వారి కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్‌లో ఉంది.