మేం ఎప్పుడూ అలాగే ఉంటాం.. కౌశల్‌పై గీతా మాధురి కామెంట్స్

Geetha madhuri about Kaushal

బిగ్ బాస్ ఇంట్లో జరిగిన విషయాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అక్కడ జరిగినవి అక్కడే మరిచిపోయాం.. అందరం ఇప్పుడు ఒకటే అనే కథలు ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరూ వినరు. ఎందుకంటే జనాలు వాటిని నిత్యం గుర్తు పెట్టుకుంటారు. అలా కొంత మంది కంటెస్టెంట్ల మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ ఉంటుందని, ఉందని జనాలు నమ్ముతూనే ఉంటారు. అలా రెండో సీజన్‌లో కౌశల్, గీతా మాధురి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే.

Geetha madhuri about Kaushal
Geetha madhuri about Kaushal

ప్రతీ సారి కౌశల్‌కు గీతా మాధురి అండగా నిలబడుతూ వచ్చేది. అందరూ కలిసి కౌశల్‌ను టార్గెట్ చేస్తుంటే గీతా మాధురి సపోర్ట్ చేసేది. అయితే కౌశల్ తప్పు ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించేది. అయితే గీతా మాధురి ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా తాను ఈ ఇంట్లో ఒంటరి.. తాను ఒక్కడిగానే ఉన్నాను.. ఆడుతున్నాను అని ప్రొజెక్ట్ చేసుకునేవాడు. అదే విషయంలో గీతా మాధురికి, కౌశల్‌కు వాగ్వాదం జరిగేది. అలా మొత్తానికి చివరకు ఈ ఇద్దరే టాప్ 2లోకి వచ్చారు.

అయితే కౌశల్ విన్నర్‌గా, గీతా మాధురి రన్నర్‌గా మిగిలింది. ఈ ఇద్దరి మధ్య గొడవలున్నాయని, బయటకు వచ్చాక మాట్లాడుకోవడం లేదని, పిలిచినా కూడా రాడు అని ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు అని కౌశల్ గురించి గీతా మాధురి చెప్పేది. తాజాగా ఈ ఇద్దరూ కలిశారు. ఆర్జే చైతూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్, గీతా మాధురిలు కలిసి వచ్చారు. కాస్త నవ్వుతూ మాట్లాడండి.. మన మధ్య గొడవలేం లేవని చెప్పండి.. అంటూ కౌశల్‌ను గీతా మాధురి వేడుకుంది. మన మధ్య ఎప్పుడూ ఏం లేదు.. కదా బాగానే ఉన్నాం కదా అని కౌశల్ చెప్పుకొచ్చాడు. మేం ఎప్పుడూ ఇలానే నవ్వుతూ కొట్టుకుంటూ ఉంటామని గీతా మాధురి చెప్పుకొచ్చింది.