Home Entertainment బిగ్ బాస్‌4: బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్.. గీతా మాధురి క్లారిటీ!

బిగ్ బాస్‌4: బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్.. గీతా మాధురి క్లారిటీ!

బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో ఓ దెయ్యం రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆ దెయ్యమే ఉండేలా కనిపిస్తోంది. నిన్నటి వచ్చిన దెయ్యం ఎవరై ఉంటుందా? అని ఇంటి సభ్యులతో పాటు బయట ఆడియెన్స్ కూడా ఆరా తీశారు. అది హరితేజ అని చాలా మంది బయట అనుకున్నారు. కానీ తాను కాదని హరితేజ క్లారిటీ ఇచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం గొంతు విన్నాక చాలా మందికి కొన్ని అనుమానాలు వచ్చాయి.

Bigg Boss 4 Telugu Week 12 Geetha Madhuri Clarity On Ghost Voice
Bigg Boss 4 Telugu week 12 Geetha Madhuri Clarity On Ghost Voice

ఇంటి సభ్యులు అయితే అది రీ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, స్వాతి దీక్షిత్ అని అనుమాన పడ్డారు. అయితే బయట మాత్రం ఇంకొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా గీతా మాధురి పేరు బాగా చక్కర్లు కొట్టింది. ఆ గొంతు గీతా మాధురిదే అని అందరూ అభిప్రాయ పడ్డారు. ఇక ఈ విషయంలో అందరూ గీతా మాధురికి మెసెజ్‌లు చేస్తుండటంతో ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వీడియోలు రిలీజ్ చేసింది. అందులో అసలు గొంతు ఎవరిదో చెప్పేసింది.

బిగ్ బాస్‌ షోలో వినిపించిన గొంతు తనది కాదని గీతా మాధురి చెప్పింది. తనలా అనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అయితే ఆ గొంతు సమీరా భరద్వాజ్ అని చెప్పింది. తనను చాలా ప్రభావితం చేశామని సమీరపై గీతా మాధురి స్వీట్‌గా అలిగింది. మొత్తానికి దెయ్యం గొంతుపై గీతా మాధురి అయితే ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇక నేడు కూడా ఈ దెయ్యం ఇంటి సభ్యులను ఆట ఆడించబోతోందని తెలుస్తోంది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News