సాయి పల్లవి సినిమాకి అందరి నుంచి ఊహించని స్థాయి రెస్పాన్స్.!

సౌత్ ఇండియా సినిమా నాచురల్ హీరోయిన్ పైగా సరికొత్త ట్యాగ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ చిత్రం “గార్గి” ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన “విరాట పర్వం” కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ వసూళ్లు రాలేదు.

అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమానే “గార్గి” కాగా ఈ చిత్రం పై కూడ పలు నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాగా సాయి పల్లవి కూడా ఒకే సమయంలో ఈ డబ్బింగ్ ని చెప్పింది.

కానీ టైం తక్కువ ప్రమోషన్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో సౌత్ లో సాయి పల్లవి మార్కెట్ పోయింది అని అంతా అంటున్నారు. కానీ అనూహ్యంగా వీటికి అతీతంగా సాయి పల్లవి గార్గి సినిమా చూసిన వారు ఊహించని రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా..

సాయి పల్లవి కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇది అని అంటున్నారు. అంతే కాకుండా సినిమా కూడా చాలా బాగుంది అని ఎక్కడా బోర్ లేకుండా ఒక మంచి సినిమాని అయితే మేకర్స్ తెరకెక్కించారని అంటున్నారు. ఇంకా అయితే రేటింగ్స్ పరంగా కూడా ఎంత ఉంటే అంత మొత్తంలో కూడా ఇచ్చేస్తున్నారు.

మరి ఈ రేంజ్ లో అయితే సినిమాకి టాక్ ఇప్పుడు వస్తుంది. మరి ఈ సినిమాకి బాక్సాఫీస్ పరంగా ఎలా ఉంటుందో చూడాలి.