క్రేజీ అప్డేట్ : బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి..!

ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ ఆఫ్ హీరోయిన్స్ అంతా కూడా తమ గ్లామర్ షో తోనే మంచి స్టార్డం కానీ మార్కెట్ ఫాలోయింగ్ అంతా తెచ్చుకున్నవారు ఉంటారు. కానీ వీటికి అతీతంగా తన నటన లుక్స్ తో మాత్రమే మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ స్టార్ బ్యూటీ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఒకామె అని చెప్పాలి.

కాగా సాయి పల్లవి అయితే ఇప్పటివరకు సాయి పల్లవి అన్నీ సౌత్ భాషల్లోనే నటించగా ఇప్పుడు ఫైనల్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్టుగా బాలీవుడ్ మీడియా వర్గాలు కన్ఫర్మ్ చేశారు. కాగా సాయి పల్లవి ఐతే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయినటువంటి ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో హీరోయిన్ గా చేసే సినిమాలో నటించనుంది అని చెప్తున్నారు.

అయితే స్కిన్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి స్కిన్ షో తోనే సినిమాలు చేసే బాలీవుడ్ లో సాయి పల్లవి ఓకే చేసింది అంటే ఆ సినిమా అలాంటిది కాదనే అనుకోవాలి. మరి మొత్తానికి అయితే ఓ సెన్సేషనల్ కాంబినేషన్ తో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీని ఫిక్స్ చేసుకుంది అని చెప్పొచ్చు.

కాగా సాయి పల్లవి రీసెంట్ గా తెలుగులో అయితే విరాట పర్వం చిత్రంలో కనిపించగా తమిళ్ నుంచి “గార్గి” అనే సినిమాలో నటించింది. అలాగే ఈ చిత్రానికి గాను పలు అవార్డులు కూడా వరించాయి.