సాహోరే.. షాకిస్తున్న జాకీ రెమ్యున‌రేష‌న్

ప్ర‌త్యేక గీతానికి స్టార్ హీరోయిన్ పారితోషిక‌మా?

`సాహో` చిత్రంలో జాక్విలిన్ ఐటెమ్ నంబ‌ర్‌ యువ‌త‌రంలోకి దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. బ్యాడ్ బోయ్ సాంగ్`ని ప్ర‌త్యేకించి `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఎల్ఈడీ స్క్రీన్ పై ప్ర‌ద‌ర్శించారు. విదేశీ మోడ‌ల్స్ న‌డుమ శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ తో డార్లింగ్ రొమాన్స్ అద‌ర‌హో అంటూ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ అందాల క‌థానాయిక జాక్విలిన్ ఒంపుసొంపులు కుర్ర‌కారును మైమ‌రిపించాయి. ఈ పాట ఆద్యంతం అద్భుత‌మైన మేనివిరుపుల‌తో జాకీ క‌ట్టి ప‌డేసింది. సాంగ్ విజువ‌ల్ రిచ్ నెస్ శంక‌ర్ సినిమాల్లో సాంగ్స్ మేకింగ్ ని త‌ల‌పించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

<

p style=”text-align: justify”>అంతా బాగానే ఉంది కానీ.. ఐదు నిమిషాల‌ ఈ పాట‌లో న‌ర్తించినందుకు జాక్విలిన్ ఎంత వ‌సూల్ చేస్తోంది? అంటే .. అమ్మ‌డు ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు యు.వి.క్రియేష‌న్స్ వెన‌క‌డుగు వేయ‌లేదు. అంటే ఒక స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాలో న‌టిస్తే అందుకునేంత పారితోషికం ఒక్క స్పెష‌ల్ నంబ‌ర్ కి అందుకుంద‌ట‌. అయితే అంత మొత్తం ఎందుకు ఇచ్చారు? అంటే జాక్విలిన్ కి యూత్ లో ఉన్న క్రేజు అలాంటిది. బాలీవుడ్ యూత్ ని ఆక‌ర్షించాలంటే ఆ మాత్రం ఖ‌ర్చు చేయాల‌నేది ఓ వ‌ర్గం చెబుతున్న మాట‌. ప్ర‌స్తుతం బ్యాడ్ బోయ్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో టాప్ 3లో ఉంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సాహో ఆగ‌స్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో మూడు పాత్ర‌లు మాత్ర‌మే ఉంటాయి. అందులో బ్యాడ్ బోయ్ సాంగ్ సంథింగ్ స్పెష‌ల్ అన్న‌మాట‌.