మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన లాస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో వరల్డ్ లెవెల్లో భారీ గుర్తింపు తెచ్చుకోగా నెక్స్ట్ అందులోని ఇండియన్ సినిమా మరో టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తుండడం మరింత ఆసక్తిగా మారింది.
ఇలా రాజమౌళి శంకర్ లతో సినిమా చేస్తున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ ఒక అరుదైన రికార్డు తన ఖాతంలో వేసుకోగా ఇప్పుడు శంకర్ తో సినిమాపై ఓ క్రేజీ గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమాకి రికార్డు మొత్తంలో బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాకి గాను నాన్ థియేట్రికల్ హక్కులు అంటే.. డిజిటల్ మరియు సాటిలైట్ హక్కులు కలిపి 200 కోట్లకి పైగా చేయగా థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషలు ఓవర్సీస్ లో కలిపి ఏకంగా 350 కోట్లు అంచనా వేస్తున్నారట. దీనితో జస్ట్ ఈ బిజినెస్ తోనే సినిమా 550 కోట్ల మార్క్ ని దాటేసిందని అంటున్నారు.
అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. శంకర్ సినిమా అంటేనే ఆ బడ్జెట్ కి తగ్గ బిజినెస్ గ్యారెంటీ అలాగే ఒకవేళ సినిమా హిట్ కానీ అయితే బాక్సాఫీస్ దగ్గర అవి కొట్టే దెబ్బ కూడా మామూలుగా ఉండదు. మరి ఈ చిత్రంలో అయితే కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.