షాకింగ్ : రికార్డు మొత్తం ధరకి “గాడ్ ఫాదర్” డిజిటల్ రైట్స్ సోల్డ్..!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి పలు చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ నుంచి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లు కలిసి నటించిన బిగ్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తెలుగు సహా హిందీ భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ చిత్రం అనుకున్న హైప్ లో అయితే ఇపుడు లేదు. కానీ చిత్ర యూనిట్ మాత్రం మళ్ళీ భారీ ధరలను బిజినెస్ లో ఉంచుతున్నారు. దీనితో సగం వరకు వీరు అనుకున్న ధరలోనే బిజినెస్ జరుగుతుండగా లేటెస్ట్ గా అయితే ఓ షాకింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది.

ఈ సినిమాకి భారీ మొత్తం ఓటిటి బిజినెస్ జరిగిందట. తెలుగు మరియు హిందీ డిజిటల్ రైట్స్ ని ప్రపంచ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ రికార్డు మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారట. మరి ఇంతకీ ఎన్ని కోట్లు ఈ సినిమాకి ఆఫర్ చేసారో తెలిస్తే షాకే అని చెప్పాలి.

ఈ సినిమాకి వారు మొత్తం 57 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించారట. దీనితో తెలుగులో రీసెంట్ టైం లో అయితే ఇది రికార్డు బిజినెస్ అని అంటున్నారు. మరి థియేటర్స్ లో అయితే ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో నయనతార కనిపించనుండగా థమన్ సంగీతం అందించాడు.