షాకింగ్ : “లైగర్” కి “ఆచార్య” ని మించి భారీ లాసులు..?

ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ లో గాని పాన్ ఇండియా సినిమా దగ్గర కానీ భారీ హైప్ తో రిలీజ్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం “లైగర్”.

ఇది నెక్స్ట్ లెవెల్ హైప్ తో టాలీవుడ్ లో సహా ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యింది. దీనితో పాటుగా ముఖ్యంగా హిందీ మార్కెట్ లో కూడా చాలా అంచనాలు పెట్టుకొని వచ్చింది. కానీ అనూహ్యం సినిమా అయితే పూర్తిగా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి భారీ లాసులు వరల్డ్ వైడ్ రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు వారు కన్ఫర్మ్ చేసారు.

ఇక ఈ ఏడాదికి అయితే మన టాలీవుడ్ లో మెగాస్టార్ నటించిన భారీ సినిమా “ఆచార్య” అత్యధిక లాసులు మిగిల్చిన చిత్రంగా నిలవగా ఇప్పుడు దీనిని లైగర్ బీట్ చేసేలా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ ఏడాదిలో ఆచార్య సినిమా అయితే కేవలం 32 శాతం మాత్రమే రికవర్ చెయ్యగా లైగర్ అయితే ఇంకో రెండు పర్సెంట్ తక్కువ లోనే ఆగిపోయేలా కనిపిస్తుంది అని అంటున్నారు.

దీనితో అయితే ఈ ఏడాది జరిగిన బిజినెస్ లో భారీ లాసులతో డిజాస్టర్ గా నిలిచిన ఫస్ట్ సినిమాగా లైగర్ నిలిచినట్టు చెబుతున్నారు. ఈ రకంగా అయితే ఆచార్య ని విజయ్ సినిమా బీట్ చేసింది. మొత్తానికి అయితే కొరటాల శివ, పూరి జగన్నాథ్ లు ఒకదాన్ని మించి ఒకటి ఎపిక్ డిజాస్టర్ లు తీశారు.