అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేది ఎందుకో తెలిస్తే షాక్!

రొటీన్ కి భిన్నంగా క‌థ‌ల్ని ఎంచుకుని గ్రిప్పింగ్ గా సినిమా తీస్తే బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్ట‌డమే గాకుండా క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా పేరొస్తుంది. ఈ త‌ర‌హాలోనే ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు. ఇక వీర్య‌దానం కాన్సెప్టులో విక్కీ డోన‌ర్.. ఫెర్టిలిటీ సెంట‌ర్ మిస్టేక్ తో పిండం తారుమారు అన్న కాన్సెప్టుతో గుడ్ న్యూస్ చిత్రాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఇదే లైన్ లో మ‌రో సినిమా తెలుగులో రీమేక్ కానుంది. 2017 కొరియ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ `హంజా` తెలుగులో రీమేక‌వుతోంది. `స్వామిరారా` ఫేం సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. ఇక ఈ సినిమా క‌థాంశం ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకోనుంద‌ని తెలుస్తోంది. ఓ ఫెర్టిలిటీ సెంట‌ర్ కోసం మ‌గువ‌ల్ని కిడ్నాప్ చేసి వారి ఎగ్స్ ని దొంగిలించే కిడ్నాప‌ర్ల క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇక ఇదే చిత్రాన్ని ఇంగ్లీష్ లో మిడ్ నైట్ రన్న‌ర్స్ పేరుతో తెర‌కెక్కించారు.