షాకింగ్ న్యూస్ : కరోనా బారిన పడ్డ విలక్షణ దర్శకుడు మణిరత్నం.!

Maniratnam's Navarasa will be released on 9th August

ఇండియన్ సినిమా దగ్గర చాలా నాచురల్ గా అదిరే సినిమాలు చేసే ఫైనెస్ట్ దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం కూడా ఒకరు. ఇప్పుడు అంటే తాను ఫామ్ లో లేరు కానీ తన వర్క్ ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి ప్రభావం తీసుకొచ్చారో తెలిసిందే.

అయితే తర్వాత తన వర్క్స్ పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అవ్వలేదు. ఇంకా తన బ్రాండింగ్ వల్లే ఆ సినిమాలకి అంతో ఇంతో గుర్తింపు వచ్చినా అవి వైఫల్యాలు గానే మిగిలిపోయాయి. ఇక వాటిని మించి భారీ సినిమాలు “పొన్నియిన్ సెల్వన్” ని తమిళ నాట ఒక భారీ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగా..

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా యూనిట్ మరో షాక్ తగిలింది. గత కొన్ని రోజులు కితమే హీరో చియాన్ విక్రమ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి బయటకి రాగా ఇపుడు దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడినట్టుగా సినీ వర్గాలు షాకింగ్ న్యూస్ ని బయట పెట్టాయి.

దీనితో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. మరి సినిమా ఇంకా రిలీజ్ కి దగ్గరలో ఇలా జరగడం తో అభిమానులు కూడా కాస్త ఆందోళనగా ఉండగా ఇండియన్ సినిమా ప్రముఖులు మణిరత్నం త్వరగా కోలుకొని తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.