ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తూలితే, ఇంత రాద్ధాంతమా.?

Shocking Trolling Against YS Jagan

Shocking Trolling Against YS Jagan

దిశ యాప్ పట్ల అవగాహన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఏర్పటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ మహిళ.. అంటూ మాట తూలారు. నిజానికి, పొరపాటున దొర్లిన మాట అది.

హోంమంత్రిగా మహిళకు అవకాశమిచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పదలచుకున్నారు. మహిళ, హోంమంత్రిగా వున్నారు గనుక.. రాష్ట్రంలో మహిళలకు భద్రత వుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసే క్రమంలో వైఎస్ జగన్ మాట తడబడ్డారు. దీన్ని పట్టుకుని టీడీపీ విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టింది.

టీడీపీ అనుకూల మీడియాలోనూ పెద్ద రచ్చ జరుగుతోంది. ఓ టీడీపీ మహిళా నేత అయితే, ‘ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు.. తాను ముఖ్యమంత్రిని కాదని.. ‘ అంటూ ‘సాధన దీక్ష’ సందర్భంగా వెకిలి వ్యాఖ్యలు చేశారు. నిజానికి, నారా లోకేష్ పండించే కామెడీతో పోల్చితే, ముఖ్యమంత్రి నోట దొర్లిన మాట పెద్ద తప్పిదమేమీ కాదు.

నారా లోకేష్ మీడియా ముందుకొస్తే, ఏదో ఒక ఆణిముత్యాన్ని వదులుతుంటారు. ఆయా సందర్భాల్లో నారా లోకేష్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతకు మించి.. అన్నట్టుగా వైఎస్ జగన్ మీద ట్రోలింగ్ షురూ అయ్యింది.

బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు మాటల్లో తప్పులు దొర్లడం వింతేమా కాదు. కాకపోతే, ఇప్పుడు సోషల్ మీడియా దేన్నీ ఊరికే వదిలిపెట్టడంలేదు.. చిన్న పొరపాటునీ బూతద్దంలో చూస్తోంది గనుక, రాజకీయ నాయకులు కాస్త అప్రమత్తంగా వుండాలి.