హిట్టా..ప్లాఫా ?: ‘శైలజారెడ్డి అల్లుడు’ క్లోజింగ్ కలెక్షన్స్

అక్కినేని నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటినా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ పడలేదు. మాస్ రూట్ లోకి వెళ్లి హిట్ కొడదామనే ఆశలుకూడా చెల్లాచెదురు అవుతున్నాయి.  తన తండ్రి చేసిన అల్లరి అల్లుడు తరహాలో ఓ చిత్రం చేసి హిట్ కొడదామని ఫిక్స్ అయ్యి చేస్తే అదీ అంతంతమాత్రంగా మిగిలింది.

నాగ చైతన్య, అనూ ఇమాన్యుయేల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ అయ్యి జస్ట్ ఓకే సినిమాగా మిగిలింది. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫక్తు మసాలా చిత్రంగా,రొటీన్ కామెడీ ప్రహసంగా మారింది. అయితే మారుతి, చైతూ కాంబో అనేసరికి  ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగిందని సమాచారం. ముఖ్యంగా  అత్త పాత్రలో రమ్యకృష్ణ  నటించి క్రేజ్ తెచ్చింది.

ఇప్పటిదాకా మాస్ సినిమాల పరంగా బలమైన ముద్ర వేయలేకపోయిన చైతు ఈ సినిమాతో ఆ ఇమేజ్ సాధిస్తాడనే నమ్మకంతో ట్రేడ్ కూడా బాగానే పెట్టుబడులు పెట్టింది. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే పాతిక కోట్ల దాకా సితార సంస్థ అమ్మేసినట్టుగా సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం క్లోజింగ్ బిజినెస్ ఎంత జరిగిందో ఏరియా వైజ్ చూద్దాం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా 18.34 కోట్ల షేర్ సాధించింది.

ఏరియా వైజ్ బ్రేకప్ చేస్తే…

నైజాం : Rs 4.50 Cr
సీడెడ్: Rs 2.85 Cr
ఉత్తరాంధ్ర: Rs 1.85 Cr
ఈస్ట్ గోదావరి : Rs 1.55 Cr
వెస్ట్ గోదావరి : Rs 96 Lakhs
గుంటూరు: Rs 1.40 Cr
కృష్ణ : Rs 1.08 Cr
నెల్లూరు: Rs 65 Lakhs

మొత్తం ఎపి/తెలంగాణా రెండు రాష్ట్రాల షేర్ కలిసి: Rs 14.84 Cr
భారత్ లో మిగిలిన ప్రాంతాలు: Rs 1.85 Cr
ఓవర్ సీస్ : Rs 1.75 Cr
ప్రపంచ వ్యాప్తంగా శైలజారెడ్డి టోటల్ కలెక్షన్స్ : Rs 18.34 Cr
ట్రేడ్ రిపోర్ట్ : బిలో యావరేజ్