సీరియల్స్ స‌రే కానీ సినిమాలు స్టార్ట‌య్యేదెపుడు?

tollywood
సీరియ‌ల్స్ షూటింగ్ స్టార్ట్.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!
 
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో హ‌డావుడి మొద‌లైంది. మూడు నెలల విరామం తర్వాత తిరిగి షూటింగుల కోలాహాలం క‌నిపిస్తోంది.  గురువారం, తెలుగు టీవీ సీరియల్స్ చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కొవిడ్ 19  అన్ని మార్గదర్శకాలను కొనసాగిస్తూ.. టీవీ సీరియల్స్ తొలిరోజు సంద‌డి ఆస‌క్తిని రేకెత్తించింది.
 
త‌దుప‌రి సినిమాల నిర్మాణం ప్రారంభం కోస‌మే వెయిటింగ్. ప్రస్తుతం, రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. కొత్త మార్గదర్శకాలతో షూట్ ప్రారంభించడానికి రాజ‌మౌళి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
సెట్లలో పరిమిత సిబ్బందితో సన్నివేశాలను తెర‌కెక్కించ‌డం సాధ్య‌మేనా కాదా? అన్న‌ది టెస్ట్ చేయ‌బోతున్నారు. ఈ వారంలోనే షూట్ ప్రారంభం కానుంది. రాజమౌళి టీమ్ ప‌ని విజయవంతమైతే, ఇతర చిత్రాల షూటింగుల‌కు ఇదే అనుసరిస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే అస‌లు సిస‌లు కార్యకలాపాలు టాలీవుడ్ లో మొద‌లు కాన‌ట్టే.