ప్రభాస్ వరల్డ్ సినిమాపై బయటకి వచ్చిన సెన్సేషనల్ మాస్ అప్డేట్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కోసం అందరికీ తెలుసు. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుండగా దీనికి గాను భారీ లెవెల్లో విజువల్స్ తో మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా సుమారు 50 శాతం పూర్తి కాగా ప్రభాస్ అయితే ఈ సినిమా షూటింగ్ ని ఈ సెప్టెంబర్ 4 నుంచి పాల్గొననున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై అయితే ఇప్పుడు ఒక సెన్సేషనల్ అప్డేట్  వచ్చింది.

మన ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా నిలిచినటువంటి ప్రముఖ స్టంట్ మెన్ బ్రదర్స్ అన్బిరవ్ కేజీఎఫ్ ఫేమ్ ఫైట్ మాస్టర్ లు రంగంలోకి దిగారట లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఈ కాంబో ఈ సినిమా సెట్స్ లో ఉన్న ఫొటోలే వైరల్ గా మారాయి.

లేటెస్ట్ గా అయితే ఈ ఇద్దరి కంపోజ్ చేసిన సినిమా “విక్రమ్” ఫైట్స్ కి మంచి పేరొచ్చింది. అలాగే కేజీఎఫ్ 2 లో కూడా హాలీవుడ్ లెవెల్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాలో అయితే ఎలాంటి సీక్వెన్స్ లను డిజైన్ చేస్తారో చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.