కళామాతల్లిని అందర్నీ అక్కున చేర్చుకుంటుంది. కష్టే ఫలి. నిబద్దతతో కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ఆ కళామాతల్లి మన వైపు చూడక మానదు. తప్పక సక్సెస్ అవుతాం. ఆ నమ్మకంతోనే ఎంతో మంది చిత్ర పరిశ్రమలో సక్సెస్ అవ్వాలని వస్తుంటారు. కానీ అందులో అందరూ సక్సెస్ కాలేరు. కొందరే సక్సెస్ అవుతారు. కొందరకే పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి. ఈ ప్రాసస్ లో కాలమనేది కూడా కలిసి రావాలి అంటారు. అవును అలా కలిసొచ్చినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయన్నది ఇండస్ర్టీలో చాలా మంది చెప్పే మాట. మరి ఫెయిలైన వాళ్లలలో లోపం ఏంటి అంటే! అలాగని వాళ్లని ఎత్తి చూపడానికి లేదు. టైమ్ ఒక్కటే కలిసి రాలేదు అనుకోవాలేమో అనిపిస్తుంది. కాసేపు సక్సెస్..ఫెయిల్యూర్ విషయాలు పక్కనబెట్టి అసలు ట్రాక్ లోకి వస్తే!
సక్సెస్ అవ్వడం ఒక ఎత్తైతే..ఆ సక్సెస్ ని నిలబెట్టుకోవడం..కొనసాగించడం అనేది మరో ఎత్తు. ఎందుకంటే `అర్జున్ రెడ్`డిలా ఓవర్ నైట్ లో స్టార్ అయిన వాళ్లు ఉన్నారు. అదే నైట్ లో పాతాళానికి పడిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎదిగిన వాళ్లు ఒదిగి ఉండాలి. క్రమ శిక్షణతో మెలగాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలా ఎదిగిన వాళ్లంతా క్రమశిక్షణ ఎల్లకాలం పాటించకతప్పదు. ఆ ఆర్డర్ లో ఎక్కడా తేడా జరిగిన ఆ తర్వాత పరిణామాలే వేరుగా ఉంటాయి అనడానికి చిత్ర పరిశ్రమలో ఎందరో ఉదాహరణలుగా ఉన్నారు. ఆ హీరో చివరి క్షణాలు చాలా దుర్భరంగా గడిచాయి? ఆ నటి శేష జీవితం పేదరికంలోనే మగ్గిపోయిందంట! అన్న మాటలు పరిశ్రమలు తరుచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం.
అందుకు కారణాలు అనేకం కావచ్చు. దురలవాట్లు కావొచ్చు…పిల్లలు పట్టించుకోకపోవడం కావొచ్చు. సంపాదించిన ఆస్తులన్నీ పిల్లల పేరిటి గుడ్డిగా పెట్టేసి చేతులు కాల్చుకోవడం కావొచ్చు. కారణం ఏదైనా చివరిగా ఆ పరిస్థితిలు ఎదుర్కునేది ఎవరు? అంటే ఎదిగిన ఆ మహావృక్షమే నేల కొరిగినప్పుడు. అవును దశాబ్ధాల క్రితం లెజెండరీ నటుడు రాజనాల కాళేశ్వరరావు జీవితం ఇలాగే ముగిసిందన్నది ఓ సీనియర్ పాత్రికేయుడి అభిప్రాయం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ప్రతి నాయకుడిగా చెరగని ముద్ర వేసిన రాజనాల చివరి జీవితం ఎంతో దుర్భరంగా ముగిసిందన్నారు. చివరి క్షణాల్లో 1994లో రాజనాల అమీర్ పేటలోని ఓ రేకుల షేడ్ లో గడిపారని స్వయంగా ఆయన జీవితాన్ని చూసిన ఓ సీనియర్ పాత్రికేయుడు చెప్పడం విశేషం.
ప్రతి నాయకుడిగా 1953 నుంచి 1977 మధ్యలో ఓ వెలుగు వెలిగి నటుడాయన. హీరో ఎవరైనా సరే ముందుగా రాజనాల డేట్లు తీసుకున్నారా? అని హీరోలు అడిగేవారుట. రాజనాల తమ సినిమాలో తప్పకు ఉండాల్సిందేనని హీరోలు, నిర్మాతలు అంతగా పట్టుబట్టేవారు. ముందుగా రాజనాల డేట్లు తీసుకున్న తర్వాతే హీరోల డేట్లు తీసుకోమని చెప్పేవాటరు. సాంఘికమైనా, పౌరాణికమైన, జానపదమైనా రాజనాల కావాలి అంతే. నెల్లూరుకు చెందిన రాజనాల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేసారుట. ఆ ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోకి వచ్చారు. అయితే రాజనాలకు ఆర్ధిక క్రమశిక్షణ అనేది ఉండేది కాదని ఆయనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, సహ నటులు చెప్పేవారుట. చివరి క్షణాల్లో రాజనాలకు ఈవీవీ సత్యనారాయణ, చిరంజీవి ఆర్ధిక సహాయం చేసినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకి హైదరాబాద్ లో ఉండలేక చెన్నై వెళ్లి అక్కడే తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.