త్రివిక్రమ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు

రైటర్ గా కెరీర్ మొదలుపెట్టి, అనతికాలంలోనే టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఎదిగాడు. కెరీర్ మొదట్లో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా చేరి, ఆ తర్వాత దర్శకుడు విజయ్ భాస్కర్ దగ్గర ‘స్వయంవరం’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు రైటర్ గా పనిచేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత ‘నువ్వే నువ్వే’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా త్రివిక్రమ్ ఉన్నాడు.

అయితే త్రివిక్రమ్ తనకు అవకాశాలు ఇస్తాను అని ఇప్పటివరకు కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదని అంటున్నాడు సీరియల్ నటుడు కృష్ణ కౌశిక్. దూరదర్శన్ లో ‘కిట్టుగాడు’ సీరియల్ తో బాలనటుడిగా ఫేమస్ అయిన కౌశిక్ చాలా సీరియల్స్ లో నటించాడు, కానీ సినిమాల్లో మాత్రం బ్రేక్ రాలేదు.

దూర‌దర్శ‌న్ లో తాను న‌టించిన కిట్టుగాడు సీరియ‌ల్ ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఎక్కువ‌గా చూసేవార‌ని చెప్పారు. త‌న‌కు త్రివిక్ర‌మ్ అవ‌కాశాలు ఇస్తాన‌ని చెప్పాడ‌ని కానీ ఆ త‌ర‌వాత ఇవ్వ‌లేద‌ని అన్నాడు.

అలాగే త‌న తండ్రిని సినిమా ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌కుండా తొక్కేశారు అంటూ కౌశిక్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా తాను సినిమా అవ‌కాశాల కోసం టాలీవుడ్ లోని డైరెక్టర్ ల‌ను అంద‌రినీ క‌లిశాన‌ని చెప్పారు.

టాప్ డైరెక్టర్ లు అంద‌రినీ సంప్ర‌దించాన‌ని కానీ ఎవ‌రూ ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొంత‌మంది అడ్వాన్స్ లు ఇచ్చిన త‌ర‌వాత ఆ సినిమాలు క్యాన్సిల్ అయ్యాయ‌ని చెప్పారు.

కౌశిక్ తమ్ముడు బాలాదిత్య కూడా ‘అన్న’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. కానీ సరైన హిట్ లేకపోవడంతో సీరియల్స్ లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం బాలాదిత్య తెలుగు బిగ్ బాస్ సీసన్ 6 లో ఉన్నాడు.