Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు కొందరు స్వయంకృషితో పైకి రాగా మరికొందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకున్నవారు వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత హీరోగా మారి వరసగా సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే చాలు థియేటర్ల వద్ద మాస్ జాతరే. ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు హీరో. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థం అయ్యే ఉంటుంది. ఆ హీరో మరెవరో కాదండోయ్ మాస్ మహారాజా రవితేజ. మొదట సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత విలన్ గా కూడా నటించారు రవితేజ.
కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో చిన్న విలన్ రోల్ లో కనిపించాడు. ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన రవితేజ ఆ తర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ. ప్రస్తుతం స్టార్ హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన ట్రాక్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. తర్వాత ధమకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్ అందుకున్నాడు రవితేజ.