పరువు పోతేనేం.. డబ్బులొస్తాయ్.! ఓ సినీ జీవి ఆలోచనా విధానం ఇలా తగలడింది. సినిమాల్లో కమెడియన్ అంటే ఒకప్పుడు బాగా తన్నులు తినేటోడు. నిజంగానే అప్పట్లో తన్నాల్సి వచ్చేది.. గట్టిగా కాదు లెండి, నెమ్మదిగానే అయినా.. తన్నులైతే తప్పేవి కాదు. సహజత్వం కోసమది.!
సినిమా సంబంధిత ప్రెస్ మీట్లలో ప్రశ్నలు సంధిస్తోన్న కొందరి పరిస్థితి కూడా అంతే. హీరోయిన్లను టార్గెట్ చేసి, చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. అలాంటి ఓ ‘హాస్యగాడి’ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మొదట్లో తింగరోడని అనుకున్నారుగానీ, తెలివైనోడేనట. ప్రశ్న ప్రశ్నకీ.. కాసులు గట్టిగా రాబడుతున్నాడట. హీరోయిన్ల పుట్టుమచ్చల గురించీ, వల్గారిటీ గురించీ.. సంధించిన ప్రశ్నలు అతని మస్తిష్కంలోంచి వచ్చినవి కావంటున్నారు.
పేమెంట్ అందితే.. పరువు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడే ఆ హాస్యగాడెవరబ్బా.?