ఆ సీనియర్ హీరో కి ఆ దేశంలో పది ఎకరాల గార్డెన్ రెండు ప్యాలెస్ లు ఉన్నాయా?

ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక్క వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైపోయింది వాళ్లలో సీనియర్ నటుడు నరసింహరాజు కూడా ఒకరు. కెరీర్ మొదట్లో ‘ఆంధ్ర కమల్ హాసన్’ గా పిలవబడేవాడు.

పున్నమి నాగు, నీడ లేని ఆడది, తూర్పు పడమర, జగన్మోహినీ ఇలా దాదాపు 110 సినిమాల్లో నటించాడు నరసింహ రాజు. ఒకప్పుడు కాంత రావు తర్వాత జానపద సినిమాల హీరోగా నరసింహ రాజు బాగా పేరు తెచ్చుకున్నాడు.

చిరంజీవి నటించిన ‘పున్నమి నాగు’ సినిమాలో నరసింహ రాజు హీరో, చిరంజీవి విలన్. అలాగే ‘పునాదిరాళ్ళు’ సినిమాలో కూడా చిరంజీవి ఒక చిన్న రోల్ చేస్తే అందులో కూడా హీరో నరసింహ రాజు. అయితే కొన్ని కారణాలవల్ల నరసింహరాజు సినిమా కెరీర్ దెబ్బతింది. తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించిన నరసింహ రాజు ప్రస్తుతం హ్యాపీ గానే ఉన్నాడు.

అతని కొడుకు కూడా సినిమాల్లో నటించాలని అనుకున్నాడు కానీ నరసింహ రాజు వద్దనడంతో కెనేడాకి వెళ్లి, బ్యాంక్ ఆఫ్ మొనిట్రీల్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. మరోవైపు నరసింహ రాజు కూతురు వివిధ కళాశాలకు హెచ్ఆర్ గా వ్యహరిస్తున్నారు.

ఇక తన పిల్లలతో, హ్యాపీ గా చక్కని జీవితాన్ని గడుపుతూ ఉంటారు నరసింహ రాజు. అలాగే కేనేడాలో 10 ఎకరాల గార్డెన్, 2 ప్యాలెస్ లు ఉన్నాయంటే. ప్రతి  వేసవి కాల సెలవులకి తన కొడుకు దగ్గరకి వెళ్లి సంతోషంగా కాలాన్ని గడుపుతారు నరసింహ రాజు.