హీరోయిన్‌తో ఘాటు రొమాన్స్.. శేఖర్ మాస్టర్ రచ్చ రచ్చ

Sekhar Master Performance WIth Poorna In ETV 25th Anniversary Celebration

శేఖర్ మాస్టర్ అంటే బుల్లితెరపై ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. మాస్ స్టెప్పులకైనా సరే, దిమ్మతిరిగే సెటైర్లకైనా సరే శేఖర్ మాస్టర్ రెడీగా ఉంటాడు. ఢీ షోలో, అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపై వేసే సెటైర్స్ ఎంతగా పాపులర్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఇక స్పెషల్ ఈవెంట్లకు శేఖర్ మాస్టర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా రోజాతో చేసే స్కిట్ అయినా, ఆమెతో చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్ అయినా వేరే లెవెల్‌లో ఉంటుంది.

Sekhar Master Performance WIth Poorna In ETV 25th Anniversary Celebration

ఈటీవీ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు జబర్దస్త్, ఈటీవీ సీరియల్స్ వారంతా కలిసి అదిరిపోయేలా వేడుకలు నిర్వహించారు. ఇందులో జబర్దస్త్, ఢీ యూనిట్ల హంగామే ఎక్కువగా ఉంది. అయితే దీనిలో భాగంగా శేఖర్ మాస్టర్ మరోసారి దుమ్ములేపాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్, మనో కలిసి చేసిన స్కిట్,అందులో రోజా వేసిన పంచ్‌లు బాగానే వైరల్ అయ్యాయి. అంతకు మించి హీరోయిన్ పూర్ణ తో శేఖర్ మాస్టర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అందరిలోనూ వేడిని పుట్టించింది.

డీజే సినిమాలో గుడిలో బడిలో అనే పాటకు పూర్ణ  తో కలిసి శేఖర్ మాస్టర్ రెచ్చిపోయాడు. సిగ్నేచర్ స్టెప్పులు వేసి పూర్ణతో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశాడు. వీరి పర్ఫామెన్స్‌కు రోజా సైతం ఆశ్చర్యపోయింది. ప్రతీసారి నాతో చేసేవాడు.. ఈసారి పూర్ణతో చేస్తున్నాడు ఎలా చేస్తాడా? అని అనుకున్నాను అంటూ రోజా కాస్త ఫీలైనట్టు కనిపించింది. మొత్తానికి ఇద్దరి పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.