శేఖర్‌ కమ్ముల సలహాలివ్వడు!

శేఖర్‌ కమ్ముల అనే పేరు చెప్పగానే  వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనేది ఇట్టే స్ఫురిస్తుంది. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ వంటివన్నీ అలాంటి సినిమాలే. తెలుగులో నిఖిల్‌, వరుణ్‌ సందేశ్‌, రానా, సాయిపల్లవి పరిచయం చేశారు. తాజాగా విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ను పరిచయం చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కథాచర్చలు, ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తన సినిమాలను  కొడుకుగానో, కూతురుగానో భావించే శేఖర్‌ కమ్ముల తాజాగా ధ్రువ్‌తో తీసే సినిమాను ఎలా పోలుస్తారో చూడాలి. శేఖర్‌ అభిప్రాయం మేరకు సినిమా పరిశ్రమలో సక్సెస్‌లు మూడుశాతం మాత్రమేనట. అందుకే తన ఎన్నారై ఫ్రెండ్స్‌ ఎవరైనా వచ్చి డబ్బులు పెడతామని, సినిమాలు తీస్తామని.. ఏమైనా సజెషన్స్‌ ఇవ్వమని  అడిగినా శేఖర్‌ ఇవ్వరట. ఈ విషయాన్ని ఆయనే  స్వయంగా చెప్పారు. రిస్క్‌ ఎక్కువగా ఉన్న చోట నమ్మి ఇన్వెస్ట్‌ చేయమని తానెప్పుడూ చెప్పనని ఆయన తెలిపారు. సత్తా ఉన్న కథలు మాత్రమే విజయానికి అర్హమైనవని తెలిపారు. అందుకే ప్రీ ప్రొడక్షన్‌  మీద తాను ఎక్కువగా టైమ్‌  స్పెండ్‌ చేస్తాననీ అన్నారు.