‘ద లయన్‌ కింగ్’లైవ్ యాక్షన్ ట్రైలర్‌

పిల్లలకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటి లయిన్ కింగ్. ఇప్పటికే చాలా సార్లు హాలీవుడ్ ఈ కథని తెరకెక్కించి సొమ్ము చేసుకుంది. దాదాపు ప్రతీ ఐదేళ్లకు ఓ కొత్త వెర్షన్ తో అదే కథని తిప్పి చెప్తూ బిజినెస్ చేసుకుంటుంది డిస్నీ స్టూడియో. ఇదిగో ఇప్పుడు మరో సారి తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యింది.

గతంలో ఘనవిజయం సాధించిన ఈ యానిమేషన్‌ ఫిలిం ను మరింత టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు. ద లయన్‌ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్‌ పాత్రలకు హాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్‌ చెప్తూ క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

The Lion King Official Trailer

తాజాగా రిలీజ్‌ అయిన ద లయన్‌ కింగ్‌ ట్రైలర్‌ పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్‌ అయిన సిండ్రెల్లా, ద జంగల్‌ బుక్‌, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్‌ కింగ్‌ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్‌ కానుంది.