‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’: సుప్రీం కోర్ట్ లో వర్మకు ఎదురుదెబ్బ

ఏపీలో వివాదాలకు కేంద్ర బిందువైన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హైకోర్టు స్టే విధింపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలనే దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఏపీలో నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

వర్మ మాట్లాడుతూ… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయంపై పేర్లు వెల్లడించను. హైకోర్టు స్టే విధించినందున నేనేమీ మాట్లాడను. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతాను అన్నారు.