ఆత్మహత్యలు వద్దే వద్దంటూ హ్యాష్ ట్యాగ్!
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాద మరణం పరిశ్రమలకు కనువిప్పు. నటీనటుల మానసిక ఆరోగ్యం, నిరాశ ఆత్మహత్యలపై మునుపెన్నడూ లేని విధంగా చర్చ సాగుతోంది. అనేక మంది టాలీవుడ్ తారలు కూడా ఆత్మహత్యలపై అవగాహన పెంచడానికి .. నిరాశతో పోరాడటానికి చర్చలో చేరారు.
చాలా మంది యువ తరం తారలు సోషల్ మీడియాలోకి వచ్చి వారి ఇద్దరు స్నేహితులను ట్యాగ్ చేస్తున్నారు. తమ సందేశాన్ని కాపీ చేసి పోస్ట్ చేయమని .. స్నేహితులను మరింతగా ట్యాగ్ చేయమని అభ్యర్థిస్తున్నారు. సందేశంలో ప్రధానంగా రెండు ఆత్మహత్య అవగాహన సంఖ్యలు ఉన్నాయి (యుఎస్ కోసం: 1-800-273-8255 మరియు భారతదేశం కోసం: 09152987821)
ఈ మిషన్‌లో రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్, లావణ్య త్రిపాఠి, సాయి తేజ్, లక్ష్మి మంచు, ఈషా రెబ్బా, రితు వర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ తారలు పాల్గొన్నారు.