Meenakshi Chaudhary: సుశాంత్‌ పెళ్లి కామెంట్లు.. మీనాక్షి చౌదరి రియాక్షన్‌!

Meenakshi Chaudhary: ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ లీడింగ్ లో కొనసాగుతోంది మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). సుశాంత్‌ (Sushanth) నటించిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇటీవలే ‘లక్కీ భాస్కర్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈమె అక్కినేని సుశాంత్‌ను పెళ్లి చేసుకోబోతుందని ఇండస్ట్రీ సర్కిల్‌లో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ వార్తలపై మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) క్లారిటీ ఇచ్చేసింది. ‘మెకానిక్‌ రాకీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఈ విషయమై మాట్లాడుతూ.. తాను కూడా ఈ పుకార్లను విన్నానని చెప్పింది. వెడ్డింగ్‌ అంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేస్తూ.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. అంతేకాదు ‘సలార్‌ -2’లో తాను భాగస్వామ్యం అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పింది.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో ఛాన్స్‌!

తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఏదైనా ముఖ్యమైన విషయముంటే అందరితో షేర్‌ చేసుకుంటానంది. మీనాక్షి చౌదరి ఇటీవలే ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు వెంకటేశ్‌-అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

నవ్వలేక చచ్చిపోతారు || Pawan Kalyan Laughting Over Gummadi Sandhya Rani Comments On Ys jagan || TR