మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గానే విడుదలయింది. ఇక ఈ సినిమాకు విడుదల కంటే ముందే కాస్త తక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగా ట్రైలర్ సాంగ్స్ టీజర్ ఏది కూడా అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనే చర్చ ముందు రోజు నుంచి కొనసాగుతోంది.
సినిమా టాక్ అయితే చాలా దారుణంగా రావడంతో తప్పకుండా ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పడుతుంది అని అందరూ ఉహించిందే. ఇక మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి షేర్ కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే, ఏరియాలో వైజ్ గా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం ఏరియాలో 4.51 కోట్లు, సీడేడ్ లో 2 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.84 కోట్లు, ఈస్ట్ లో 1.32 కోట్లు, వెస్ట్ లో 1.85 కోట్లు, గుంటూరులో 2.08 కోట్లు, కృష్ణ ఒక కోటి, నెల్లూరులో 73 లక్షలు వచ్చాయి. ఇలా ఆంధప్రదేశ్ తెలంగాణలో ‘భోళా శంకర్’ సినిమా మొదటిరోజు 15.38 కోట్లు షేర్, 22.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి కోటికి పైగానే షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో భోళా శంకర్ 1.95 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ 18.38 కోట్లు షేర్, 28.54లో గ్రాస్ మాత్రమే. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ‘భోళా శంకర్’ సినిమా టాప్ లో నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 79.60 కోట్లు. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే సినిమా తప్పనిసరిగా 80 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. కానీ మొదటి రోజు చాలా తక్కువగా ఈ సినిమా 18 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ రాబట్టింది అంటే ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 62.12 కోట్లు రాబట్టాలి. శనివారం ఆదివారం ఎంతో కొంత సినిమాకు కలెక్షన్స్ అయితే వస్తాయి. కానీ మొదటి రోజు వచ్చినంత రాకపోవచ్చు. ఇక సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. మరి మిగతా 60 కోట్లలో సినిమా ఎంతవరకు వెనక్కి తీసుకు రాగలుగుతుందో చూడాలి.