సంక్రాంతి ఫేక్ క‌లెక్ష‌న్స్.. ఎందుకీ ప్ర‌చారం?

ఈ సంక్రాంతికి వ‌రుస‌గా నాలుగు సినిమాలు బ‌రిలో నిలిచాయి. ఇప్ప‌టికే మూడు రిలీజ‌య్యాయి. నాలుగో సినిమాగా క‌ల్యాణ్ రామ్ న‌టించిన `ఎంత మంచి వాడ‌వురా` రిలీజ‌వుతోంది. ఇక ఇప్ప‌టికే మ‌హేష్‌ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్తం కాగా బ‌న్ని అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ద‌ర్బార్ చిత్రానికి తెలుగులో మిశ్ర‌మ స్పంద‌న‌లే వ‌చ్చాయి.

అయితే ఎవ‌రి టాక్ ఎలా ఉన్నా.. ఇప్ప‌టికే సంక్రాంతి సినిమాల ఫేక్ క‌లెక్ష‌న్స్ రిపోర్ట్స్ ఇబ్బందిక‌రంగా మారాయ‌ని చెబుతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా సరైన లెక్కలు రాక ముందే ఎవరికి నచ్చిన గ‌ణాంకాల్ని వారు ప్ర‌చారం చేసేస్తున్నారు. స‌రిలేరు చిత్రానికి సంబంధించి అన్నీ ఫేక్ క‌లెక్ష‌న్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ చిత్రానికి 40 కోట్ల గ్రాస్ వస్తుందేమో అని అనుకుంటే మరికొందరు ఇంకో 26 పెంచేసి 66 కోట్లు అంటూ ప్ర‌చారం  చేశారు. మరికొందరు అయితే ఏకంగా మన సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ చిత్రాల రేంజ్ లో 70 కోట్లకు పై చిలుకు అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేయ‌డం ఓవ‌రాక్ష‌న్ బ‌య‌ట‌ప‌డింది. అసలు లెక్క ఎంత అన్నది మాత్రం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ మొదటి రోజు మాత్రం ఈ చిత్రానికి 40 కోట్ల వ‌ర‌కూ వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ చెబుతోంది. ఇక బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో ఓవ‌ర్సీస్ లో మ‌హేష్ సినిమాని డామినేట్ చేసి వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరింది. అక్క‌డ త్రివిక్ర‌మ్ మ్యాజిక్ ప‌ని చేసింది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఫేక్ లెక్క‌లు స్ప్రెడ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.