Rajinikanth : ఎంతమంది స్టార్ లు ఉన్నా ఎంతమంది యంగ్ హీరోలు రైజ్ అయ్యినా కూడా ఇండియన్ సినిమా దగ్గర కొందరి దిగ్గజాల క్రేజ్ ను గాని బాక్సాఫీస్ స్టామినా ని గాని బీట్ చేసే సీన్ అయితే వాళ్లకి లేదని చెప్పాలి. మరి అలాంటి భారీ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు.
తనకి ఇప్పుడు తన రేంజ్ సినిమాలు పడట్లేదు గాని ఒక్క పదేళ్లు వెనక్కి వెళ్లినట్టు అయితే రజినీ క్రేజ్ అంటే ఏంటో తన సినిమాలకి ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో తెలుస్తుంది. అయినా ఇప్పటికీ కూడా కూడా తన క్రేజ్ తో ఒక భారీ ప్లాప్ సినిమాతో 150 కోట్ల లాభాన్ని అందించాడట.
మరి ఇది ఏ లెవెల్ క్రేజో అందరు అర్ధం చేసుకోవాలి. రజిని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే”. తెలుగులో “పెద్దన్న” గా రిలీజ్ అయ్యి మన దగ్గర డిజాస్టర్ అయ్యింది. కానీ తమిళ్ లో మాత్రం తమ నిర్మాణ సంస్థకి 150 కోట్లు లాభం ఇచ్చింది అని స్వయంగా సన్ పిక్చర్ నెట్వర్క్ వారు అనౌన్స్ చేశారు.
వారి వార్షిక ఆదాయపు రెవెన్యూ లో రజినీ సినిమా 150 కోట్లు తెచ్చిపెట్టుంది అని ఆ షీట్ లో పొందుపరిచారు. అంటే ప్లాప్ టాక్ తో కూడా రజినీ ఎలాంటి లాభాలు అందించారో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా కీర్తీ సురేష్ రజినీకి చెల్లెలి పాత్రలో నటించింది.